5 June, 2026 | 6:05 PM

ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు

05-06-2026 05:01 PM

- బోయినిపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల సేవా కార్యక్రమాలు

- దేవాలయంలో ప్రత్యేక పూజలు

- బోయినిపల్లి కేంద్రంలో ఘనంగా కేక్ కటింగ్

- వర్ధవెల్లిలో భారీ రక్తదాన శిబిరం

బోయినపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గజన్మదినాన్ని పురస్కరించుకుని బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఘనంగా వేడుకలు నిర్వహించారు. బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఈ ఉత్సవాలను సేవా కార్యక్రమాలతో పండుగలా జరిపారు. బోయినపల్లి తడగొండ, వరద వెళ్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసికేక్ కటింగ్ చేశారు.

జన్మదిన వేడుకల్లో భాగంగా మండల అధ్యక్షులు సువీన్ యాదవ్ గారు ప్రథమంగా  తడగొండ సాయిబాబా దేవాలయంలో ఎమ్మెల్యే సత్యం అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు ప్రజలకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం బోయినిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

వర్ధవెల్లిలో రక్తదాన శిబిరం

పురస్కరించుకుని వర్ధవెల్లి గ్రామంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి కాంగ్రెస్ శ్రేణుల నుండి విశేష స్పందన లభించింది. పలువురు నాయకులు, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను సువీన్ యాదవ్  ప్రత్యేకంగా అభినందించి, వారికి పండ్లు, జ్యూస్ అందించారు. ఈ జన్మదిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఏల్లేష్ యాదవ్ , ఉపాధ్యక్షులు  రెడ్డి,మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతి గౌడ్, సర్పంచులు ఉయ్యాల శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి, నల్లమోహన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.