కొల్లగుట్ట తండా దశాబ్దాల కలకు మోక్షం
రూ. 70 లక్షలతో బీటీ రోడ్డు పనుల ప్రారంభం
నవాబ్పేట, జూన్ 28: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ నియోజకవర్గ ప్రగతికి అహర్నిశలు శ్రమిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కొల్లగుట్ట తండా వాసుల దశాబ్దాల కలను నిజం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం లింగంపల్లి ప్రధాన రోడ్డు నుండి కొల్లగుట్ట తండా వరకు సరైన రోడ్డు సౌకర్యం లేక తండా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి రూ. 70 లక్షల భారీ నిధులను మంజూరు చేయించారు.
ఈ నిధులతో నవాబ్పేట మండల పరిధిలో చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు దుష్యంత్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గములమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, వాసు యాదవ్, కూచూర్ సురేష్, చిర్ప సత్యం, సర్పంచ్ అంగూర్ సంగీత, రవీందర్ రెడ్డి, భాస్కర్ నాయక్, ఉప సర్పంచ్ అనూష రవి, ఎరుకుల రాము, మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.






