29 August, 2026 | 12:38 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

దుకాణాలు నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలి

29-06-2026 12:00 AM

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

కల్వకుర్తి జూన్ 28 :  దళిత నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్మించిన ఎస్సీ కాంప్లెక్స్ దుకాణాలను నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. కల్వకుర్తి బస్టాండ్ సమీపంలో నిర్మించిన ఎస్సీ దుకాణ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అన్హరులకే పెద్ద పీట వేశారని నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని అన్నారు.

న్యాయం కోసం నాలుగు రోజులుగా దీక్షలు చేస్తున్నా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.  ఇప్పటికైనా రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు. వారితో పాటు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి , మాజీ జడ్పిటిసి సభ్యురాలు విజితా రెడ్డి, బారాస నాయకులు తదితరులు పాల్గొన్నారు