15 July, 2026 | 12:32 AM

‘తట్టు’ చిన్నారులకు ఉచిత వైద్యశిబిరం

15-07-2026 12:32 AM

పంజాగుట్ట, జూలై 14 (విజయక్రాంతి): తట్టు వ్యాధి బాధిత చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్న రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. మంగళవారం నగరంలోని హోటల్ ఆదిత్య హోంటెల్ లో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపు నూరి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తట్టు వ్యాధికి ఇప్పటి వరకు ఎటువంటి నివారణ లేదన్నారు. ఇది కొందరిలో ప్రాణాంతకమైన నాడీ సంబంధిత సమస్య స బాక్యుట్ సెరోసింగ్ పానెపెఫాలిటిస్ (ఎస్‌ఎస్పీఈ) దారి తీస్తోందన్నారు.అంతేకాకుండా వ్యాధి సోకే అవకాశాలపై సంస్థ ఆధ్వర్యంలో పరిశోధనలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తట్టు వ్యాధికి గురైన పిల్లలు, ఎస్‌ఎస్పీఈ నిర్ధారణ అయిన పిల్లలు, తట్టు టీకాకు ప్రతిచర్యలు చూపిన పిల్లలు, ఎంఎంఆర్ టీకా తర్వారీ క్షీణత చూపిన పిల్లల కోసం మణికొండలో ఆగస్టు 9న ఉచిత వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మణికొండలోని శివపురి కాలనీలోని విజేత సూపర్ మార్కెట్ పై ఉన్న తమ కార్యాలయంలో శిబి రం జరుగుతుందన్నారు. పేర్లు నమోదు చే సుకునేందుకు 9100065552, 8433529 769 నంబర్లను సంప్రదించాలని కోరారు. బాధిత చిన్నారులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించవచ్చని తెలియజేశారు. తద్వారా తమ పరిశోధనకు సహకరించినవారు అవుతారని, తట్టు వ్యాధి బారి నుంచి బాధిత చి న్నారులకు ఉపశమనం కల్పిస్తుందనారు. రెస్ ప్లైస్‌కు చెందిన పీడియాట్రిక్స్ విభాగాధిపతి నితిన్ చావ్లా, శిశు వైద్యులు విజయ్ ఆనంద్, నారాయణ పరిశోధకలుగా వ్యవహరిస్తారని వెల్లడించారు.