కేటీఆర్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ జెడ్పీటీసీ
20-03-2026 12:28 AM
నాగిరెడ్డిపేట్, మార్చి 19 (విజయ క్రాంతి): ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ను మాజీ రాష్ట్ర జడ్పిటిసిల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు కూడా పాల్గొన్నారు.
ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరంలో అందరికీ శుభసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్తో కలిసి వారు ఉగాది శుభాకాంక్షలు పంచుకున్నారు.




