04-02-2026 01:04:08 AM
కేసముద్రం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా మాజీలైన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇందులో సర్పంచులుగా గ్రా మాన్ని ఐదేళ్లపాటు పరిపాలించిన వారు ఇ ప్పుడు వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికల బరిలో దిగడం విశేషంగా మారింది. అలాగే గత ట ర్ములో వార్డు సభ్యులు గా ఎన్నికైన వారు, మాజీ ఎంపీటీసీలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి కాలు దువ్వుతున్నారు. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.
గతంలో ఉన్న ఐదు పంచాయతీలకు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై గ్రా మాల్లో కీలకపాత్ర పోషించిన ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులకు ఇప్పుడు కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడడంతో రాజకీయ ప్రాబల్యం కోసం వార్డు కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి ఎస్టీ మహిళలకు కేటాయించడంతో అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మాజీల వివరాలు ఇలా ఉన్నాయి.
కేసముద్రం స్టేషన్ మాజీ సర్పం చ్ లు జాటోత్ సుజాత హరి, డాక్టర్ అల్లం రమ, బట్టు శ్రీనివాస్, లింగాల రాజమణి, మాజీ ఎంపీటీసీలు అంబటి లక్ష్మి, గుగులోత్ సునీత, కొమ్ము స్వాతి తో పాటు పలువురు మాజీ వార్డు సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ఇందులో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఎన్నికల ఫలితాల అనంతరం తెలియనుంది. తొలిసారిగా కౌన్సిలర్ పదవికి పోటీ చేస్తున్న మాజీ ప్రజా ప్రతినిధులు ఎంతమంది కౌన్సిలర్ గా ఎన్నికై తిరిగి తమ పదవులను నిలబెట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.