గుండా కరుణాకర్ రెడ్డికి ఘన సన్మానం
మందడి ఇజ్రాయిల్‌కు ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా నియామకం
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలోని శ్రీ సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ జేఏసీ నూతన చైర్మన్ గుండా కరుణాకర్ రెడ్డికి ఘనంగా సన్మానం నిర్వహించారు. మందడి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా మండల ప్రజలు, రాజకీయ నాయకులు, స్నేహితులు, మేధావులు, విద్యావేత్తలు హాజరై గుండా కరుణాకర్ రెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుండా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని నాయకులు, ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు, మహనీయులు అందరూ కలిసి తనను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
తనపై చూపిన అభిమానానికి, ఆత్మీయతకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మందడి ఇజ్రాయిల్ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటూ ప్రజల కోసం నిరంతరం ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మందడి ఇజ్రాయిల్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇదే సన్మాన సభ వేదికపై మందడి ఇజ్రాయిల్‌ను ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గుండా కరుణాకర్ రెడ్డి నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మందడి ఇజ్రాయిల్‌కు పలువురు నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.






