కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
25-07-2026 02:37 PM
నీట్ పేపర్ లీక్ వివాదంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశాను
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party) ఉద్యమంతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే సీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. సీజేపీ విధించిన డెడ్ లైన్ లోగానే ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం రాజీనామా(Dharmendra Pradhan resigns) చేశారు. నీట్ పేపర్ లీక్ జరిగినప్పటి నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఆందోళనలు నెలకున్నాయి. కాసేపట్లో మరోసారి చర్చలు జరగాల్సి ఉండగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించడంతో సీజేపీ ప్రతినిధులు, విద్యార్థలులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి: ధర్మేంద్ర ప్రధాన్
''10 రోజుల వరస ఘటనలు నన్ను బాధించాయి. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశాను. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు. దేశ ఐక్యత కొనసాగాలి. యువత తమ చదువు కోసమే సమయం కేటాయించాలి. మంత్రిగా ఇన్నాళ్లు నాకు అవకాశం కల్పించిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. దేశ సేవకునా అత్యున్నత ప్రాధాన్యత. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే.. సీబీఐ విచారణకు ఆదేశించాం.'' అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.







