04-02-2026 01:04:19 AM
షాద్ నగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ నియోజకవర్గం లోని ప్రముఖ షాపింగ్ మాల్ ‘రిలయన్స్ ట్రెండ్స్’లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షోరూమ్ సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భ యాందోళనకు గురయ్యారు.మంగళవారం రిలయన్స్ ట్రెండ్స్‌లో ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమా నిస్తున్నా రు.
సెల్లార్‌లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు షోరూమ్ మొత్తం అలుముకున్నాయి. దీంతో షాపింగ్ చేస్తున్న కస్ట మర్లు, సిబ్బంది ఒక్కసారిగా భయంతో బ యటకు పరుగులు తీశారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బం ది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో శ్రమిం చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంట లు ఆర్పినప్పటికీ, సెల్లార్‌లో దట్టంగా పేరుకుపోయిన పొగ వల్ల కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
షాపింగ్ మాల్ లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, ప్రాణ నష్టం జరగలేదని శ్రవణ్, రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ చెప్పారు. ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అధికారులు ప్రమాద స్థలా న్ని పరిశీలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు, ఫైర్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.