25 July, 2026 | 3:06 PM

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

25-07-2026 02:10 PM

గుడిపూడి తిరుమలరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు 

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన తిరుమలరావు..

కారేపల్లి జూలై 25, (విజయక్రాంతి): వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్  జన్మదినోత్సవం సందర్భంగా గేట్ కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు ఆధ్వర్యంలో పుస్తక బ్యాగులను శనివారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనూష,గ్రామ సర్పంచ్ పూసం ఎల్లయ్య,ఉప సర్పంచ్ కందుల శ్రీనివాసరావు,వార్డు సభ్యులు, జక్కుల కుమార్,ఓరికొర్ల వీరభద్రం,సామినేని తిరుపతి రావు,తాళ్లూరి అప్పారావు, చెరుకూరి రామారావు,మందా రామారావు,చెరుకూరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొని విద్యార్థులకు పుస్తక బ్యాగులను అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ గుడిపూడి తిరుమల రావు మాట్లాడుతూ, వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజల సంక్షేమం,నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే  ఇదే స్థాయిలో అంకితభావంతో సేవలందిస్తూ మరిన్ని విజయాలు సాధించి, ప్రజల ఆదరణను మరింత పొందాలని  ఆకాంక్షించారు