సమిష్టితత్వాన్ని ప్రోత్సహించటం FPO లక్ష్యం
నేరుగా విత్తే వరితో అధిక ఫలం
కారేపల్లిలో ఎఫ్పీవో అవగాహన సదస్సులో అధికారులు
కారేపల్లి జూలై 25 విజయక్రాంతి: సమిష్టి తత్వాన్ని ప్రోత్సహించటమే రైతు ఉత్పత్తిదారుల సంస్ధ(ఎఫ్.పీ.వో) లక్ష్యమని కోఆపరేటీవ్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య అన్నారు. శనివారం కారేపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ, కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు సంఘ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య మాట్లాడుతూ సాంకేతికను అందుకోవటంతో చిన్న సన్నకారు రైతులు వెనకబడటం మూలంగా ఉత్పత్తి తగ్గి పెట్టుబడుు పెరుగుతున్నాయన్నారు.
సాంకేతికను అందించటం కోసం ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. దీనిలో రూ.2వేలు కట్టి సభ్యత్వం తీసుకున్న రైతులకు ప్రభుత్వం మరో రూ.2వేలు వాటాగా కలుపుతుందన్నారు. వీటితో రైతులకు అవసరమైన సేవలను రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా అందించటం జరుగుతుందన్నారు. ఎఫ్.పీ.వో లో 750 మంది సభ్యులు చేర్చుకునే అవకాశం ఉందన్నారు. కారేపల్లి సోసైటీలో 400 మంది సభ్యులుగా చేరి ఉన్నారని అది పని ప్రారంభించిందన్నారు. వ్యవసాయ శాస్ర్తవేత డాక్టర్ కవిరాజ్ మాట్లాడుతూ వరిని నేరుగా విత్తే పద్దతి ద్వారా ఖర్చు తక్కువ, నీటి అవసరం తక్కువతో పాటు అధిక ఫలసాయం వస్తుందన్నారు.
దీనిలో పంట కాలం 15 రోజు తగ్గుతుందన్నారు. రైతులుతమ భూముల షోషకాల స్ధాయిని పరిశీలించి ఎరువులవాడకం చేయాలన్నారు. దానికి తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం భూసార పరీక్షల చేసే విధానాన్ని వివరించి కిట్ లను రైతులకు అందజేశారు. సమిష్టితత్వంపైరైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.పీ.వో డొమైన్ ఎక్స్ పర్ట్ చావా అరుంధతి, సీఈవో బొల్లు హనుంతరావు, దిశ కమిటీ సభ్యురాలు దారావత్ హేమలత బాలాజీ, సర్పంచ్ లు అంగోత్ మత్రు, ఈసాల వెంకటేశ్వరరావు, భూక్య పద్మ, భూక్య రంజిత్ కుమార్, పూసం రామారావు, సోసైటీ డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, రైతు ప్రతినిధులు బానోత్ రాంమ్మూర్తి, కడియాల సుధాకర్, సురేందర్ మనియర్, కిలారి అప్పారావు, సూరపురెడ్డి విష్ణవర్ధన్ రెడ్డి, పెద్దబోయిన ఉమాశంకర్, ఆదెర్ల రాములు, అడపా పుల్లారావు, అజ్మీర నరేష్, కాసాని లక్ష్మినారాయణ, గడ్డం వెంకటేశ్వర్లు, పెర్ని వెంకటేశ్వర్లు, వడ్డె అనంతయ్య, ఈసాల ఛాయాదేవి, నాగండ్ల జగన్, అజ్మీర ఈర్యా, చాగంటి వెంకటేశ్వర్లు, అజ్మీర హేమ్లా, బట్టు సంగయ్య,ధళ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.






