ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం
ఆలేరు, జులై 25 (విజయక్రాంతి): "మరణం లేని నీ జ్ఞాపకాలకు సేవా రూపంలో మా నివాళి" అనే నినాదంతో ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అమరజీవి పవన్ కళ్యాణ్ జన్మదిన స్మరణార్థం సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ రోగులకు అండగా నిలిచారు, మిత్రులు పాల్గొని అమరజీవి పవన్ కళ్యాణ్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూతురు వేదాన్షి ఫ్రెండ్స్ గంగసాని నవీన్ రెడ్డి, ఎండి బాబా, మంగళపల్లి శివకుమార్, మాదాని నవీన్, చెన్న రాజేష్, ఎర్ర రాజేష్, కాముని శివకుమార్, రావుల నరేష్, ఆడెపు భరత్, కంకల లింగస్వామి, గడ్డమీద సాయినాథ్, పర్స నరేష్, శరత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






