25 July, 2026 | 2:43 PM

ఢిల్లీలో విద్యార్థుల మహాధర్నాకు కోదండరాం సంఘీభావం

25-07-2026 02:27 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలో సీజేపీ నిరసనలకు(CJP protests) తెలంగాణ జన సమితి మద్దతు పలికింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం(TJS President Kodandaram) సీజేపీ నేతలను కలిసి సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు లేవనెత్తారని కోదండరాం పేర్కొన్నారు. పరీక్షలు సక్రమంగా జరిపి భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నారు. పేపర్ లీక్ లతో పాటు పరీక్షలు అస్తవ్యస్తంగా జరగుతున్నాయని ఆరోపించారు. సీబీఎస్ఈ, నీట్ సహా 150 పరీక్షల వరకు గందరగోళంగా మారాయని తెలిపారు.

భవిష్యత్తు ఏమవుతోందనే అయోమయ స్థితిలో విద్యార్థులు ఉన్నారని సూచించారు. పరీక్షలు సరిగా నిర్వహించకపోవడం వల్లే ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆందోళనకు ప్రజాస్వామ్యవాదులంతా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా, చట్టబద్ధంగా విద్యార్థుల ఆందోళన జరుగుతోందన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. లాఠీ ఛార్జ్ కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ కు కరారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.