25 July, 2026 | 2:51 PM

కోనరావుపేట ఏఎస్ఐ తిరుమల్‌ బాబుకు ఘన వీడ్కోలు

25-07-2026 02:03 PM

శాలువాతో సన్మానించిన ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి

కోనరావుపేట, జూలై 25 (విజయక్రాంతి): కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్ఐ)గా విధులు నిర్వహిస్తున్న తిరుమల్ బాబు బదిలీపై సిద్ధిపేట జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ అంజయ్య తిరుమల్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, కొత్త విధి నిర్వహణ స్థానంలో కూడా అదే నిబద్ధతతో పనిచేసి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.సహోద్యోగులు తిరుమల్‌ బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.