జీళ్ళచెరువు విద్యార్థి ఉత్తమ ప్రతిభ
అభినందనలు తెలిపిన గ్రామస్థులు
కూసుమంచి, జులై 25, విజయక్రాంతి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఖమ్మంలో చదివిన కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామానికి చెందిన గోపి జయశ్రీ వారికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సు కు ప్రవేశం పొందడంతో పాటు అత్యధిక రాంక్యూ వచ్చింది. ఈ విషయం తెలిసి తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్, ఎంఆర్పీఎస్ మండల కమిటీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం గోపి జయశ్రీని ఘనంగా సన్మానించారు.
గ్రామానికే గర్వంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకమిటీ సీనియర్ నాయకులు పాము లక్ష్మణ్, రాష్ట్ర ఈసీ మెంబర్ గోపి మల్లేశం, ఎంఆర్పీఎస్ కూసుమంచి మండల ఇన్చార్జి పులిపాటి వెంకన్న మాదిగ, గ్రామ శాఖ అధ్యక్షులు పొట్ట పెంజర పుల్లయ్య మాదిగ, వార్డ్ మెంబర్స్ కొండ ఉదయ్, గ్రామ పెద్దలు గోపి హరినాథ్, గోపి శ్రీనివాస్, గోపి జానకి రాములు, గోపి వెంకటేశ్వర్లు, కొండా ఉపేందర్, కత్తి శ్యామ్, గుండెపొంగు వెంకటేశ్వర్లు, యూత్ కమిటీ పాల్గొన్నారు.






