వీహెచ్ ప్రజాసేవలో కొనసాగాలి
17-06-2026 12:12 AM
వీహెచ్‌కు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు
ముషీరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు జన్మదినం సందర్భంగా మంగళవారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అంబర్ పేటలోని విహెచ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ మాట్లాడుతూ హనుమంతరావు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో, దీర్గాయుషుతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు.






