17 June, 2026 | 3:47 AM

బాధితుడికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ అందజేత

17-06-2026 02:30 AM

అలంపూర్, జూన్ 16: అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలం పులికల్ గ్రామానికి చెందిన కురువ తిమ్మప్ప అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.4 లక్షల ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు