జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్
కుమ్రం భీం ఆసిఫాబాద్ , జూన్ 16(విజయ క్రాంతి): జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే- ఐజేయు) పనిచేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ లు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ నిరంతరం పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా యూనియన్ తరపున చూస్తామన్నారు. జర్నలిస్టుల హ క్కుల రక్షణకు టీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.
జిల్లాలోని జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. యూనియన్ బలోపేతంతోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా కోశా ధికారి అడప సతీష్, టీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి దేవునూరి రమేష్ , ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కోశాధికారి శ్రీధర్, టీయూడబ్ల్యూజే ప్రతినిధు లు, జర్నలిస్టులు మేకల శ్రీనివాస్, సురేష్ చారి, భాస్కర్ చారి, రాధాకృష్ణ చారి, నితీష్ కుమార్, జానకిరామ్, రాజ్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి, కిషోర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.






