అభిలాష వొకేషనల్ సెంటర్‌ను సందర్శించిన మాజీ కార్పొరేటర్ సింధు
రామచంద్రపురం, జూలై 3: రామచంద్రపురం మండలం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్‌ఈఎల్ టౌన్షిప్లో లేడీస్ వెల్ఫేర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అభిలాష వొకేషనల్ సెంటర్ ఫర్ ఇంటెలెక్చువల్ డిసేబుల్ చిల్డ్రన్ను భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి సందర్శించారు.
గతంలో సేల్స్ఫోర్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఈ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా, పాఠశాల యాజమాన్యం భవనానికి పెయింటింగ్, స్లాబ్ లీకేజీ వంటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ఆ పనులను పూర్తిచేయించి, వాటిని పరిశీలించేందుకు సింధు ఆదర్శ్ రెడ్డి మరోసారి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ట్రెజరర్ పద్మజ, ప్రిన్సిపాల్ నీలిమ సింధు ఆదర్శ్ రెడ్డికి స్వాగతం పలికి, సహకరించిన సేల్స్ఫోర్స్ సంస్థ ప్రతినిధులకు మరియు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






