18 April, 2026 | 4:18 AM

అన్ని వర్గాలకు అధికారమే ధ్యేయం

18-04-2026 12:45 AM
  1. సామాజిక, సర్వోదయ తెలంగాణ కోసం పోరాటం
  2. సామాజిక న్యాయం కోసం కుల సంఘాలు ఏర్పాటు చేసింది మారోజు వీరన్నే
  3. ఆయన అనుచరులు మాకు మద్దతు తెలపటం ఆనందంగా ఉంది
  4. కలిసి పనిచేద్దాం.. ఇక మనల్ని ఆపే శక్తే లేదు
  5. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో అన్ని వర్గాలకు అధికారం దక్కాలన్నదే తన ధ్యేయ మని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ కనీసం గ్రామ వార్డు పదవి కూడా పొందని కులాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ జాగృతి ఈ నెల 25న ఏర్పాటు చేయ బోతున్న పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్‌ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించింది.

శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో సీపీయూఎ స్‌ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్‌నాయక్ సహా పలువురు కవితను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ మాత్రం తెచ్చుకోలేకపోయామన్నారు. ఉద్య మ సమయంలోనే ఈ అంశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

భారత్‌కు స్వాతంత్రం వచ్చిన సమయంలోనూ గాంధీ, అంబేద్కర్ ముందు కూడా ఇదే సమస్య వచ్చిందని, భారత కుల వ్యవస్థలో ఈ అంశం నిరంతరం మన ముందుంటుందని జయశంకర్ సార్ అన్నారని చెప్పారు. ముందు మనం భౌగోళిక తెలంగాణ సాధించుకొని ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారన్నారు. కానీ దురదృష్టవశా త్తు తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నా ఎన్నో కులాలు అధికారానికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని వర్గాలకు అధికారం కోసం జాగృతి నిరంతరం పోరా టం చేస్తుందని చెప్పారు. 

అందరికీ అధికారం అనగానే కష్టాలు..

బీఆర్‌ఎస్‌లో తాను ఎప్పుడైతే అన్ని వర్గాలకు అధికారం రావాలని కోరానో అప్పటి నుంచే తనకు కష్టాలు మొదలయ్యాయని కవిత చెప్పారు. కానీ ఆ కష్టాలు తన లక్ష్యం కోసం పనిచేసేందుకు తనలో కసి పెంచాయ ని తెలిపారు. ప్రతి కష్టాన్ని పాఠంగా నేర్చుకుం టూ సామాజిక తెలంగాణ కోసం ముందుకు కదులుతానని అన్నారు. ఈ నెల 25న తాము నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని చెప్పా రు. తెలంగాణ తత్వం, సామాజిక కోణం రంగరించి తమ పార్టీ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. కులాలు బలంగా ఉన్నప్పుడే వారికి రాజకీయ అధికారం దక్కుతుందని బలంగా నమ్మిన వ్యక్తి మారోజు వీరన్న అని చెప్పారు.

రాష్ర్టంలో కుల సంఘాలకు కర్త, కర్మ, క్రియ ఆయనేనని గుర్తుచేశారు. కులాల అస్తిత్వాన్ని, విప్లవ ఉద్యమాలకు జతచేసి సామాజిక న్యా యం కోసం వీరన్న కృషి చేశారని పేర్కొన్నా రు. ఆయన మన ముందు పెట్టిన బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. తాము పార్టీ పెట్టబోయే ముం దు మీరిచ్చిన ధైర్యం మామూలు విష యం కాదన్నారు. మా రోజు వీరన్న అనుచరులంటే ఎంతో నైతికత ఉన్న వారని చెప్పారు. వీరన్న అనుచరుల మద్దతుతో రాష్ర్టంలో ఇక తమను ఆపే శక్తే లేదని ధీమా వ్యక్తంచేశారు. అందరం సమన్వయంతో పనిచేసుకుందామని పిలుపునిచ్చారు. మీరిచ్చిన ధైర్యంతో సర్వోదయ తెలంగాణ కోసం ముం దుకు కదులుతానని అన్నారు. 

మాజీ మావోయిస్టుల కోసం పోరాడుతాం

తెలంగాణ ఉద్యమంలో మాజీ మావోయిస్టులు లక్ష మంది వరకు పాల్గొన్నారని కవిత గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో వారంతా బీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ బలంగా మారేందుకు చోదక శక్తి అయ్యారన్నారు. కానీ రాష్ర్టం ఏర్పడిన తర్వాత వారెవరికీ కూడా మేలు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమకారు లు, తెలంగాణ అమరవీరుల కోసం ఏ విధంగా భూపోరాటం చేస్తున్నామో, మాజీ మావోయిస్టుల కోసం కూడా అదే విధంగా పోరాడుతామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ అమలుచేస్తామని నమ్మబలికి, ఇప్పు డు ఆ ఊసే ఎత్తటం లేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలైన సీపీ ఎస్ రద్దు, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరణను గాలికి వదిలేసి కాం గ్రెస్ తన నైజాన్ని బయటపెట్టుకుందన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీం కేవలం కాగితాలకే పరిమి తం చేశారని, రిటైర్మెంట్ బకాయి లు చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

ఇది ఉద్యోగ లోకాన్ని ఘోరంగా మోసం చేయటమేనని అన్నారు. కనీసం వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వ టం లేదన్నారు. ఉద్యోగులకు రా వాల్సిన ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు. ప్ర భుత్వ మొండి వైఖరికి నిరసన గా మధ్యాహ్న భోజన సమయం లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు చేపట్టిన నిరసనకు జాగృతి తరఫున మద్దతు ప్రకటించామన్నా రు. ఇప్పటికైనా  ఉద్యోగులకిచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.