సూర్య ‘ప్రతాపం’
18-04-2026 12:31 AM
సూర్యాపేట, నెట్ వర్క్ : జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు బయటికి వెళ్లాలంటే ఎండలు సుర్రుమంటున్నాయి. దీంతో జనాలు ఏ పనులున్నా ఉదయం 9 గంటల లోపు, లేదా సాయంత్రం ఐదు గంటల తరువాతే చూసుకుంటున్నారు. దీంతో 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపుగా వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
వాహనదారులు సైతం ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రయాణాలను నిలిపేస్తున్నారు. తప్పని పరిస్థితి అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత 40 డిగ్రీ కంటే అధికంగా ఉండడంతో తప్పక తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






