calender_icon.png 18 February, 2026 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక భరోసా

18-02-2026 03:24:56 PM

– సర్పంచ్  చింతల విజయ వెంకట్రాం రెడ్డి

శివంపేట్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ప్రముఖ సంఘసేవకులు, కొంతాన్‌పల్లి గ్రామ సర్పంచ్  చింతల విజయ వెంకట్రాం రెడ్డి గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందజేయడం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, తలారి నర్సింలు – మౌనిక దంపతులకు పుట్టిన ఆడ బిడ్డ పుట్టిన సందర్భంగా రూ.5,000 మరియు బ్యాగరి సంతోష్ – నందు కిషోర్ దంపతులకు ఆడ బిడ్డ పుట్టిన  సందర్భంగా రూ.5,000లను సర్పంచ్  స్వంత నిధుల నుండి అందజేశారు.

ఆడపిల్లల భవిష్యత్తు భద్రత, విద్యాభివృద్ధి మరియు సమాన హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఈ సహాయం అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరియు సీవీర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.