7 August, 2026 | 4:54 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం

29-06-2026 12:09 AM

బూర్గంపాడు, జూన్28 (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన నిరుపేద మహిళ మహమ్మద్ ఆశాబి గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండంతో ఎస్ కే లఫా - జకాత్ ట్రస్ట్ నిర్వాహకులు ఎస్. కే.లాల్ మహమ్మద్ ఆధ్వర్యంలో శనివారం ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్బంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎస్ కే లఫా - జకాత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు కొనసాగుతు న్నామని.. మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్యను అయినా సరే మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే ముందు ముందు కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటామని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు నాగూర్ వలీ, రజాక్, బషారత్, నషీర్, అక్తర్, అజీమ్ పాల్గొన్నారు.