ఆర్థిక శాఖ అత్యుత్సాహం..- ఇహెచ్‌ఎస్ కటింగ్ మొదలు
తీవ్రంగా ఖండించిన టిఎస్ యుటిఎఫ్
మంచిర్యాల టౌన్, మే 31 : ఉద్యోగుల ఆ రోగ్య పథకం విధివిధానాలు ఖరారు కాలే దు. హాస్పిటల్స్ తో ఒప్పందం కుదిరింది లే దు. ప్యాకేజి రేట్లు నిర్ణయించలేదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వనేలేదు. ఈహెచ్‌ఎస్ చం దా 1.5 శాతం మినహాయింపుపై జిఒ ఇవ్వ నూ లేదు. కానీ ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో ఈహెచ్‌ఎస్ చందా పేరిట ఉద్యోగుల మే నెల వేతనాల్లో 1.5 శాతం కోత విధించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజావేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధివిధానాల గురించి అడిగితే ఆరోగ్య శాఖ ఇస్తుందని సమాధానం చెప్పిన ఆర్థిక శాఖ అధికారులు ఆ విధివిధానాలు లేకుండానే వేతనాల్లో కోత ఎలా పెడతారని ప్రశ్నించారు.ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల వివరాలు ఐఎఫ్‌ఎంఐఎస్ సైట్ లో ఈరోజు వరకు నమోదు చేయాలని గడువు విధించి, నిన్నటిదాకా వెబ్ సైట్ లో మార్పులు చేస్తూనే ఉన్నారు. వివరాలు పూర్తిగా తీసుకోనే లేదన్నారు. పాత నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరే చందా చెల్లించాలనీ, ఇప్పుడు ఇద్దరి నుంచి మినహాయించారనీ, ఆధారిత కుటుంబ సభ్యులపై స్పష్టత రానే లేదన్నారు. నిజానికి ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే, కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం ఖరీదైన సమయంలో ఉద్యోగులు కూడా కొంత భరించాలని ప్రభుత్వం కోరినప్పుడు సంఘాలు అంగీకరించాయనీ, అయినా వేతనంలో 1.5 శాతం కోత నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వెంటనే జోక్యం చేసుకొని వేతనాల్లో కోతలు నిలివేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ తీసుకున్న ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతుందని వారు హెచ్చరించారు.






