1 June, 2026 | 2:06 AM

విద్యాశాఖలో భారీ బదిలీలు

01-06-2026 01:09 AM
  1. డీఈవో, డీడీ ఏడీ, జేడీలకు స్థానచలనం
  2. ఆన్‌లైన్‌లోట్రాన్స్‌ఫర్లు తొలిసారి

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖలో భారీగా అధికారులు బదిలీలయ్యారు. బదిలీలైన వారిలో ప్రధానంగా డీఈవోలు, డిప్యూటీ డైరెక్టర్లు, అడిషన ల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం అధికారులు, బోధనేతర సిబ్బంది బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.38 బదిలీల సమగ్ర మార్గదర్శకాల ప్రకారం ఈ బదిలీలు చేపట్టినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నీకోలస్ ఆదివారం అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా బోధనేతర సిబ్బంది బదిలీలను ఆన్‌లైన్ విధానంలో చేపట్టినట్లు తెలిపారు. అడిషనల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ స్థాయి వరకు జిల్లా/జోనల్/మల్టీ జోనల్/స్టేట్ కేడర్‌కు చెందిన అన్ని బదిలీలను విజయవంతం గా నిర్వహించామని పేర్కొన్నారు. అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీస ర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు బదిలీ అయ్యారన్నారు. 

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సెక్రటరీ గా ఉన్న సీహెచ్ రమణ కుమార్ ప్రస్తుతం మిడ్ డే మీల్స్ అడిషనల్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) డైరెక్టర్‌గా ఉన్న పీవీ శ్రీహరి ప్రస్తుతం అడిషన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్(సమగ్రశిక్ష)గా వెళ్లారు. అడిషనల్ డైరెక్టర్ (కోఆర్డినేషన్)గా ఉన్న కె.లింగయ్య ఇప్పుడు టాస్ డైరెక్టర్‌గా, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ (అదనపు బాధ్యతలు)గా వ్యవహరించను న్నారు.

అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (సమగ్రశిక్ష)గా ఉన్న రాధారెడ్డి ఇప్పుడు టెక్ట్స్ బుక్ ప్రెస్ డైరెక్టర్‌గా, మిడ్ డే మీల్స్ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న జి.ఉషారాణి ఇప్పుడు రెసిడెన్షి యల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. జాయింట్ డైర్టెర్‌గా ఉన్న పి.మధన్‌మోహన్ ఇప్పుడు సమగ్రశిక్ష జాయింట్ డైరెక్టర్‌గా, టాస్ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న ఎం.సోమిరెడ్డి ఇప్పుడు రీజనల్ జాయింట్ డైరెక్టర్ (హైదరాబాద్)గా, సమగ్రశిక్ష జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న పి.రాజీవ్ తాజాగా టాస్ జాయింట్ డైరెక్టర్‌గా, వరంగల్ ఆర్జేడీగా ఉన్న కె.సత్యనారాయణ రెడ్డి ఇప్పుడు మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్‌తోపాటు అడిషనల్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నా రు.

ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఎ.ఉషారాని సమగ్రశిక్ష జా యింట్ డైరెక్టర్(2)గా, సమగ్రశిక్ష జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న బి.వెంకటనర్సమ్మ ఇప్పుడు జాయింట్ డైరెక్ట్(సర్వీసెస్)గా, హైదరాబాద్ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న ఇ.విజయ లక్ష్మీ తాజాగా వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

డిప్యూటీ డైరెక్టర్ (టెట్ విభాగం)గా ఉన్న పి.రేవతిరెడ్డి ఇప్పుడు మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్‌గా, హైదరాబాద్ డీఈవోగా ఉన్న ఆర్.రోహిణి ఇప్పుడు సంగారెడ్డి డీఈవోగా, సంగారెడ్డి డీఈవోగా ఉన్న వెంకటేశ్వర్లు ఇప్పుడు రంగారెడ్డి డీఈవోగా, మంచిర్యాల డీఈవోగా ఉన్న యాద య్య, హైదరాబాద్ డీఈవోగా బదిలీ అయ్యా రు. మరికొంత మందీ బదిలీ అయ్యారు.