13 May, 2026 | 1:47 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

గాయపడ్డ మిత్రునికి తోటి ఫోటోగ్రాఫర్ల సహాయం

31-10-2025 05:07 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన ఫోటోగ్రాఫర్ అట్టేం మధుకర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలు కాగా స్థానిక ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘం సభ్యులు అతనికి ఆర్థికంగా చేయూతనిచ్చారు. మధుకర్ ఇటీవల ఒక షూట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా తన ద్విచక్ర వాహనానికి కోతి అడ్డుగా రావడంతో ప్రమాదానికి గురై పడిపోవడంతో గాయాల పాలయ్యాడు. దీంతో నిర్మల్ జిల్లా యూనిట్ సభ్యులు బాధితున్ని పరామర్శించారు. శుక్రవారం అతని స్వగ్రామమైన మాసాయిపేట్ గ్రామంలో ఉన్న తన ఇంటికి వెళ్లి మిత్రబృందం రూ. 5000 నగదు ఆర్థిక సహాయం చేశారు.