అకాల వర్షాలతో రైతుల ఆందోళన
19-03-2026 12:00 AM
జైనథ్ మార్కెట్ యార్డ్ లో తడిసిన కంది పంట
ఆదిలాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు ఆందోళన చెందారు. చేతికందిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తీసుకురాగా అకాల వర్షాలు వల్ల కంది పంట తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. జైనథ్ మార్కెట్ యార్డ్ లో అమ్మకానికి తీసుకొచ్చిన కంది పంట సంచులు గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయాయి.
దీంతో బుధవారం అన్నదాతలు తడిసిన తమ పంట ను ఎండలో ఆరబెట్టుకున్నారు. అటు ఇప్పటికే అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు మరో మారు నష్టాన్ని తెచ్చి పెట్టనున్నాయి.




