20 March, 2026 | 1:49 AM

సమాజాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర

19-03-2026 12:00 AM

కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవం 

నిర్మల్, మార్చి 18 (విజయక్రాంతి) : ఈ సమాజమైన అభివృద్ధి సాధించాలంటే ఆ సమాజంలో ఉండే స్త్రీలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయపరంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంత ర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగు లకు సన్మానం చేశారు. సాధారణ మహిళతో కలిసి కేక్ కట్ చేసి సీట్లు పంచి పెట్టుకున్నారు.

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో మహిళలు ఎంతగానో పాలుపంచుకుంటున్నారని గుర్తు చేశారు. మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు రాజ్యాంగ హక్కులు చట్టా లు సద్వినించుకొని ప్రతి ఒక్కరూ చదువుకొని సమాజంలో మార్పు కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.

మహిళలు ఈరంగంలోనైనా రాణిస్తారని నిర్మల్ జిల్లాలో కలెక్టర్ ఎస్పీ జిల్లా శాఖ అధికారులు మహిళా అధికారులుగా ఉన్న విష యాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ విజయలక్ష్మి జిల్లా సంక్షేమ శాఖ అధికారి వినూత్న, ఖజానా శాఖ అధికారి సరోజ మహిళ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18(విజయ క్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, కౌన్సిలర్ అనుమండ్ల స్వప్న రాణిలను శాలువాలు కప్పి సత్కరించారు. వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షు డు ఇరుకుల్ల ఆంజనేయులు అధ్యక్షత వహించారు.

మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని ఈ సం దర్భంగా వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీకాంత్, కార్యదర్శి అల్లే శ్రీకాంత్, కోమటిపల్లి లింగ య్య, పసుపునూరి తిరుపతి, జంగిరాల లక్ష్మీనారాయణ, మహిళా సంఘం అధ్యక్షురాలు జంజీరాల పుష్పలత, కోశాధికారి అనుమాండ్ల క్రాంతి కుమారి, ప్రచార కార్యదర్శి గుజ్జా రేవతి, జయ, సుజాత, ప్రేమల, లహరి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.