దుష్టశక్తులకు పరాభవం కలగాలి
- పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
- రాష్ట్ర బడ్జెట్ అందరికి ఆమోదయోగ్యంగానే ఉంటుంది
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో మేలు జరగాలి
- పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
- గాంధీభవన్‌లో ఉగాది వేడుకలు.. పంచాంగ శ్రవణం
హైదరాబాద్, మార్చి19 (విజయక్రాంతి) : ఉగాది పరాభవ నామ సంవత్సరం సందర్భంగా గాంధీ భవన్‌లో గురువారం చిలు కూరు శ్రీనివాస్ మూర్తి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ పంచాంగశ్రవణంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ , పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ పరాభవనామ సంవత్సరం సందర్భంగా దుష్ట శక్తులకు పరాభవం కలగాలని, రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో సుఖసంతాలతో ఉండాలన్నారు.
రా ష్ట్రంలో అన్ని రంగాలు దిగ్విజయంగా ఎదగాలని, తెలంగాణ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వివిధ ప్రజలను కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని హామీల అమలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఇందిర మ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉగాది పండుగను ఆనందోత్సాహాల మధ్యన సం తోషంగా జరుపుకోవాలన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో మేలు జరగాలని, ప్రజలు సుఖ శాంతులతో ఉండే లా భగవంతులు ఆశీస్సులు ఉండాలన్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జునఖర్గే , సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కృషితో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు అంత ఎంతో శ్ర మించి ఒక అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఆయన కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పరాభవ నామ సంవత్సరంలో ఎవరు ఎవర్ని పరాభవం చేయకుండా అంత కలిసి కట్టుగా సుఖ శాంతులతో ఉండాలని, ప్రభు త్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలా లు ప్రజలకు అందే విదంగా అర్హులైన వారి లబ్ది పొందే విదంగా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలన్నారు.




