ఆయిల్ ఫామ్ తోటలతో అధిక లాభాలు
- కుకునూరు పల్లి ఏవో గోవిందరాజు
కొండపాక: కుకునూరు పల్లి మండలం తిప్పారం గ్రామంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ (ఎన్ఎమ్ఇఓ -ఓపి ) కార్యక్రమాన్ని కుక్కునూరు పల్లి మండల అగ్రికల్చర్ అధికారి గోవిందరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పారం గ్రామానికి చెందిన రైతు సోమలేటి వరలక్ష్మి తన మూడు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. రైతులు పంటల విద్యుదీకరణతో పాటు అధిక ఆదాయం పొందేలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జాతీయ తినదగిన నూనెల మిషన్ ఆయిల్ ఫామ్ (ఎన్ఎమ్ఇఓ -ఓపి ) పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తిప్పారం గ్రామ సర్పంచ్ భద్రప్ప, మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం సాంకేతిక సలహాలు, మొక్కలు, వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తుందని అర్హులైన రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీహరి, ఆయిల్ఫేడ్ ఫీల్ ఆఫీసర్ రాజు, సుధాకర్, డ్రిప్పు అధికారి శ్రీనివాస్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.






