20 March, 2026 | 1:04 PM

మర్రన్న క్యాంటీన్‌కి సిలిండర్ సెగలు

20-03-2026 12:00 AM

గ్యాస్ కొరత కారణంగా నిలిచిన ఐదు రూపాయల భోజనం 

నాగర్ కర్నూల్ మార్చి 19 ( విజయక్రాంతి ) పచ్చిమాసియాలోని ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమరు ని లువలపై ఏర్పడిన ప్రభావం నాగర్ కర్నూల్ జిల్లాలోనూ గ్యాస్ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వినియోదార్లు గ్యాస్ బుకింగ్ కోసం ఎంతగా ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర గందరగోళా నికి గురవుతున్నారు. కమర్షియల్ సిలిండర్లకు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్న నేపథ్యంలో వ్యాపారాలు ఇతర హోటల్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

చివరికి నిరుపేదలు అర్థాకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం మర్రన్న క్యాంటీన్ సైతం మూతపడింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిరుపేదల అర్ధాకలి తీర్చేందుకు జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం క్యాంటీన్ గ్యాస్ కొరత కారణంగా మూసేసినట్లు బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల నుంచి పనుల నిమిత్తం వచ్చిన నిరుపేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోపక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్ ఇతర వ్యాపారం పైనే జీవనం సాగించే వారికి సిలిండర్ కొరత దడ పుట్టిస్తుంది. 

ఆయా దుకాణాల ముందే కట్టెల పోయి దుకాణాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. మరి కొంతమంది తమ పలుకుబడితో సబ్సిడీ సిలిండర్లను సైతం వ్యాపారానికి వినియోగిస్తుండడంతో అధికారులు ఆలస్యంగా మేల్కొని దాడులు చేపడుతున్నారు. సబ్సిడీ సిలిండర్ లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తున్నారు.