10 July, 2026 | 7:25 PM

సీఎం సభకు ఆర్టీసీ బస్సులు.. జనం తిప్పలు

10-07-2026 06:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభకు నిర్మల్ జిల్లా నుంచి టీజీ ఆర్టీసీ బస్సులను తరలించడంతో శుక్రవారం జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. నిర్మల్ కేంద్రంగా వివిధ రూట్ లకు నడిపించే బస్సులను కొన్ని షెడ్యూలు రద్దు చేయడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. బస్సుల కోసం గంటల తరబడి నిలబడ్డారు. వచ్చిన బస్సులు సరిపోక జనం బస్సులు ఎక్కేందుకు పోటీ పడవలసి వచ్చింది. దీంతో వృద్ధులు చిన్నపిల్లలు రోగులు బస్సులు ఎక్కలేక నానా అవస్థలు పడ్డారు.