పారదర్శకంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా
గద్వాల, మార్చి 19 : ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవస్థను మరింత పార దర్శకంగా మార్చడానికి, వినియోగదారుల భద్రతను పటిష్టం చేయడానికి ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కొన్ని కీలక మార్పులు, ని బంధనలను అమలు చేస్తున్నాయని, వినియోగదారులు వీటిని గమనించి సహక రించవలసిందిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు వినియోగదారులకు సరిపోయేటన్ని ఉన్నాయని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒకసారి గ్యాస్ రీఫిల్ బుకింగ్ చేసుకున్న త ర్వాత, తదుపరి సిలిండర్ కోసం బుక్ చేయడానికి కనీసం 45 రోజుల గడువు పాటిం చాలన్నారు. ఈ కాల పరిమితిలోపు బుకింగ్ చేయడానికి అనుమతి ఉండదన్నారు. 45 రోజుల వరకు ఒక్క సిలిండర్ ను పొడుపుగా వాడుకోవాలని సూచించారు.వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్తో అనుసంధాన మైన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే బు కింగ్ చేయాలని పేర్కొన్నారు.
ఇతర నంబర్ల నుంచి చేసే బుకింగ్లు పరిగణనలోకి తీసుకోబడవని, ఒకవేళ ఫోన్ నంబర్ మారినట్లయి తే, వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. ఆయా కం పెనీల వారీగా గ్యాస్ సిలిండర్ లను బుకింగ్ చేసుకోవడానికి ఇండియన్ 7718955555, హెచ్ పి గ్యాస్ : 9222201122, భారత్ గ్యాస్ : 7715012345 ఫోన్ నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చన్నారు.
సిలిండర్ డెలివరీ సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటిపి నంబర్ ను డెలివరీ సిబ్బందికి తెలియజేసిన తర్వాతే సిలిండర్ ఇస్తారన్నారు. వినియోగదారులు రశీదుపై ఉన్న ధరను మాత్రమే డెలివరీ సిబ్బందికి చెల్లించాలన్నారు.
అదనపు రుసుములు అడిగితే ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్దార్ 90103 10309 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ లేదా ఇతర ప్రమాద సమయాల్లో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1906 కు సమాచారం అందించాలన్నారు. వినియోగదారు లు ఈ నియమాలను పాటిస్తూ, సురక్షితమైన మరియు సులభతరమైన సేవలను పొందవలసిందిగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.




