10 July, 2026 | 7:25 PM

జూలై 13న విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలు వేయించాలి

10-07-2026 06:13 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని  ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, మైనారిటీ, రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ మరియు ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం రోజున ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీఎంసీ (జేసీ), బోధన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మండల విద్యాధికారి నాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నాగయ్య మాట్లాడుతూ... భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ మొదటి సంవత్సరం వరకు చదువుతున్న 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండాజోల్  మాత్రలను తప్పనిసరిగా అందించాలని సూచించారు.

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తరఫున డాక్టర్ సమత మాట్లాడుతూ,..నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడి, పోషకాహార లోపం తగ్గడంతో పాటు విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ విద్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను అనుసారంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో తనుసరిగా నులిపురుగుల మాత్రం మింగించాలని తెలపడం జరిగింది. అన్ని విద్యాసంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి ఆల్బెండాజోల్ మాత్ర అందేలా చర్యలు చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫాతిమా వైద్య సిబ్బంది కిరణ్ రాజు రవి ఐసిడిఎస్ సిబ్బంది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు సిఆర్పిలు పాల్గొనడం జరిగిందని బోధన్ మండల విద్యాధికారి నాగయ్య తెలియజేశారు