19 May, 2026 | 10:32 AM

పెద్దికీ పర్సంటేజీ కావాల్సిందే!

19-05-2026 12:00 AM

పెద్ది సినిమాకు కూడా పర్సంటేజీ ఇస్తేనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఇటీవల 26 మందితో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీకి అనుబంధంగా ఉండే ఉప కమిటీలోని 21 మంది సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమాకు కూడా కచ్చితంగా పర్సంటేజీ కావాలంటూ ఎగ్జిబిటర్లు ప్రతిపాదించారు.

కాస్త తక్కువ ఇచ్చినా పర్వాలేదని, కానీ అద్దె మాత్రమే ఇస్తామంటే కుదరదని భీష్మించారు. దీంతో నిర్మాతలు.. రెంట్‌తోపాటు 7.5 శాతం వాటా ఇస్తామంటూ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీంతో మున్ముందు వచ్చే సినిమాలకు ఎలా చెల్లిస్తారో రాత పూర్వకంగా తమకు హామీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంగళవారం మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు వెల్లడించారు.