‘రెడ్‌బ్యాగ్’లో సావిత్రిగా..
19-05-2026 12:00 AM
మెమరీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. రవికుమార్ సీర పు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ రాశి కనిపించనున్నారు. ఆమె పాత్రను ‘సావిత్రి’గా పరిచ యం చేస్తూ ఇం దుకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పాత్ర గెటప్, లుక్స్ ఎంత సింపుల్‌గా ఉన్నాయో.. రాశి లుక్ అంత ఇంటెన్స్‌గా ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి శేఖర్ మోపురి సంగీతం అందించగా, ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా పనిచేశారు.






