6 May, 2026 | 9:59 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

యూరిప్.. పరేషాన్

10-03-2026 01:58 AM

పంట సాగు కోసం రైతులకు యూరియా సులభతరంగా అందించాలని రాష్ట్రప్రభుత్వం రూపొందించిన యూరిప్ యాప్‌తో రైతులకు పరేషాన్ తప్పడం లేదు. అధికారులు ఆన్‌లైన్‌లో స్టాక్ కేటాయించిన క్షణాల్లోనే యూరియా బస్తాలు మాయమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఇతరుల వద్దకు వెళ్లి బుకింగ్ కోసం నానా యాతన పడుతున్నారు. ఫర్టిలైజర్ దుకాణాలు, గ్రోమోర్, పీఏసీఎస్, హాకా, ప్రైవేట్ డీలర్ల స్టాక్ పాయింట్ల ముందు యూరియా విడుదల చేసిన వెంటనే పదుల సంఖ్యలో రైతులు స్మార్ట్ ఫోన్లు ఓపెన్ చేసుకుని ఓటీపీల కోసం హడావిడి చేస్తున్నారు.

ఫర్టిలైజర్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకున్న రైతులు ఎకరానికి మూడు బస్తాల వరకు కావాల్సిన సొసైటీల డీలర్ల వద్ద పొందడానికి అవకాశం కల్పించింది. మొదటి విడత యూరియా బుకింగ్ చేసుకున్న రైతులకు మళ్లీ 15 రోజుల తర్వాతనే యూరియా బుకింగ్‌కు అవకాశం ఉంది.

ఓటీపీలు రావడం కావాల్సిన డీలర్ల దగ్గర స్టాక్ చూపకపోవడంతో రైతులకు సకాలంలో యూరియా దొరకడం లేదు. యూరియా ఆన్‌లోన్ కోటా విడుదల చేసిన సమయంలో స్మార్ట్ ఫోన్లు స్ట్రక్ అవుతూ సతాయిస్తున్నాయి. చిన్న సన్నకారు రైతులకు యూరియా ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. 

               సంతోశ్, కోయిలకొండ మండలం, మహబూబ్‌నగర్