27 June, 2026 | 9:55 PM

కూకట్పల్లి ఎమ్మెల్యేకు ఎన్యుమరేషన్ ఫామ్ అందజేత

27-06-2026 08:54 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ ప్రక్రియ లో భాగంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు శనివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేషన్ పత్రాన్ని అందజేసిన కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరికైనా ఓటు హక్కును కాపాడుకునే విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఎస్ ఐ ఆర్ పై ఎవరికైనా అనుమానాలు ఉంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం  9394115559 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ (పార్టీ) సభ్యత్వ నమోదు ఇంచార్జ్ గజ్జెల నగేష్,తదితరులు పాల్గొన్నారు.