27 June, 2026 | 9:55 PM

భార్యాభర్తలు అదృశ్యం

27-06-2026 08:52 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): భార్యాభర్తలు అదృశ్యమైన సంఘటన పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  వనమాల గిరీష్ కుమార్ (39), అతని భార్య వనమాల అనిత (35) ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని బొక్కోనిగూడలో నివాసముంటున్నారు. పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్ వద్ద ఒక గ్లాస్ కంపెనీని స్థాపించారు.  గిరీష్ కుమార్ సోదరుడు హరీష్ కుమార్ సోదరుడికి ఫోన్ చేయగా ఫోన్ ఎత్తలేదు.

 ఆ తర్వాత తన వదిన వనమాల అనిత కి ఫోన్ చేయగా ఆమె కూడా ఫోన్ ఎత్తలేదు. దీంతో అతను వెంటనే  ఇంటికి వెళ్లి చూడగా, ఇంటి తలుపులు తాళం వేయకుండా కేవలం మూసి ఉంచబడ్డాయి. లోపలికి వెళ్లి చూడగా, తన సోదరుడు, వదినల మొబైల్ ఫోన్లు బెడ్‌పైనే ఉన్నాయి.

తన సోదరుడి కంపెనీకి వెళ్లి కార్మికుడిని విచారించగా ఉదయం 6 గంటల సమయంలో భార్యాభర్తలు కారును పార్కింగ్ చేసి యంనంపేట్ రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్లారని తెలిపాడు. వెంటనే అతను తన సోదరుడు, వదినల కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో, స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తన సోదరుడు, వదిన ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉంటారని పేర్కొన్నారు.ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.