14-02-2026 05:37:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు ఉపయోగపడే A. COMPANION TO ENGLISH FOR BRILLIONCE అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని వశిష్ట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్ రచించారు. ఈ పుస్తకాన్ని శనివారం కళాశాలలో వశిష్ట కళాశాల డైరెక్టర్ వి.సత్యనారాయణ గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టుపై మంచి పరిజ్ఞానాన్ని, సరళమైన భాషలో అందించడంలో విశేషంగా కృషిచేసిన రచయిత అఖిలేష్ కుమార్ సింగ్ ను అభినందించారు. విద్యార్థులు ఈ పుస్తకాన్ని పట్టుదలతో చదువుకొని పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని అన్నారు. డిగ్రీలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సరోత్తమ్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.