calender_icon.png 14 February, 2026 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీది కృత్రిమ విజయం

14-02-2026 05:34:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని సాధించిందని, నైతిక విజయం బీజేపీదేనని బిజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా బిజెపి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించిన నిర్మల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 1 సీటు తో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 13 సీట్లు కైవసం చేసుకుందన్నారు.

రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.మూడు పార్టీలు ఒక్కటై మేక పోతూ గాంభీర్యం ప్రదర్శించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 27 వేల ఓట్లు సాధిస్తే,కేవలం బిజెపి 20 వేల 335 ఓట్లు సాధించిందన్నారు. మైనార్టీ ఓటు బ్యాంకుతోనే కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, శనిగరపు చిన్నయ్య, నారాయణ రెడ్డి, కూన శివకుమార్, సాధాం అరవింద్, తో పాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల తదితరులు పాల్గొన్నారు.