calender_icon.png 12 February, 2026 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

12-02-2026 02:02:05 AM

జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, ఫిబ్రవరి 11 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత 5 మున్సి పాలిటీలకు బుధవారం పోలింగ్ ప్రశాంతం గా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమ రచింత 5 మున్సిపాలిటీల్లో మొత్తం కలిపి8 8,738ఓట్లు పోల్ కాగా, 75.56% వోటింగ్ పర్సంటేజీ నమోదయిందని కలెక్టర్ తెలిపారు.

కాగా, మున్సిపాలిటీ వారీగా చూసు కుంటే వనపర్తిలో 45,904 ఓట్లు పోల్ కాగా71.51%, కొత్తకోటలో 14,319, ఓట్లు పోల్ కాగా 78.71% పెబ్బేరు లో 11,912 ఓట్లు పోల్ కాగా83.11%, ఆత్మకూరు లో 8958 ఓట్లు పోల్ కాగా7736% , అమరచింత 7645 ఓట్లు పోల్ కాగా83.58% న మోదైనట్లు తెలిపారు.

బుధవారంఉదయం 7 గంటల నుండి ప్రారంభమయి సా యంత్రం 5.00 గంట వరకు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ తీరును కలెక్టరే ట్లోని సమావేశం మందిరం నుండి వెబ్ కా స్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, సాధారణ ఎన్నికల పరిశీలకులు లక్ష్మి బాయి, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ తో కలిసి పర్యవేక్షించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.