12-02-2026 12:00:00 AM
ఎమ్మెల్యే అహ్మద్ బలాల
మలక్‌పేట్, ఫిబ్రవరి 10 (విజయ్ క్రాంతి): నియోజవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చావుని డివిజన్లో భాగ్-హే-జహారా, మదీనా మజీద్ సమీపంలోని బస్తీలలో ఎమ్మెల్యే అహ్మద్ బలాల వివిధ శాఖల అధికారులతో ఇంటిం టి పాదయాత్ర చేశారు.
ప్రధానంగా మదీనా మసీదు బస్తీలో సీవరేజ్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా విద్యుత్ తీగలు సమస్య లు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే వివరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు వెంటనే పూర్తి చేసే సం బందిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఎం.ఏ. సలాం షాహిద్ తదితరులు పాల్గొన్నారు.