9 May, 2026 | 2:16 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

09-05-2026 01:02 AM

ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి 

మేడ్చల్, మే 8 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు కృషి చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేకు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కే రవిచంద్ర, పాక రవీందర్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ ఎదుట జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల బాధితులకు తమ గోడు చెప్పుకోవడానికి సౌకర్యంగా ఉందన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు.