1 June, 2026 | 3:29 AM

బీజేపీలో ఈటల ఫ్లెక్సీ కలకలం

01-06-2026 02:44 AM
  1. ఈటల ఏడుపే బీజేపీకి శాపం! అంటూ ఫ్లెక్సీ..
  2. సొంత పార్టీ నేతలే ఏర్పాటు చేయించారని ఈటల వర్గీయుల అనుమానం 

మేడ్చల్, మే 31 (విజయక్రాంతి): మల్కాజిగిరి పార్లమెం టు సభ్యుడు ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లె క్సీ బీజేపీలో కలక లం రేపింది. మేడ్చ ల్ రింగ్ రోడ్డు వద్ద ఈటెల రాజేందర్ నివాసానికి కొద్ది దూరం లో ’ఈటెల ఏడుపే బిజెపికి శాపం!’అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సొంత పార్టీ నేతలే ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారని ఈటల వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఈటెలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అవసరం లేదు. బిజెపిలోనే తీవ్ర వర్గపోరు నడుస్తోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఈటల రాజేందర్ లక్ష్యంగా చేసుకొని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.