1 June, 2026 | 3:29 AM

తెలంగాణ చరిత్రపై రచనలు రావాలి

01-06-2026 02:43 AM
  1. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు
  2. న్యాయస్థానాలు ప్రశ్నార్థకంగా తీర్పులిస్తున్నాయి
  3. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్‌రెడ్డి
  4. దేశంలో ఎన్నికల వ్యవస్థ బ్రష్టు పట్టిపోయింది
  5. తెలంగాణ తొలి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): తెలంగాణ చరిత్రను నిలబెట్టుకోవడానికి ఎన్నో రచనలు రావాలని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ అన్నారు. తెలంగాణ చరిత్ర అస్థిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫ్రీలాన్స్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త డా.నీలం సంపత్ రచించిన సోషయల్ ఫర్ స్పెక్టివ్స్ పుస్తకావిష్కరణ సభ తెలంగాణ తెలుగు పరిశోధక మండలి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ పుస్తకాన్ని ప్రొ.కో దండరామ్ ఆవిష్కరించి మాట్లాడారు. నిరంతరం అధ్యాయనం ఉంటేనే వ్యాసాలు రా యడం సాధ్యమవుతుందని, వ్యాసాలు రా యాలంటే చాలా శ్రమ పడాలని అన్నారు. నీలం సంపత్ మంచి పుస్తకాన్ని సమాజానికి అందించారని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ మీడి యా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడుతూ న్యాయస్థానాలు కూడా ప్రశ్నార్థకంగా తీర్పులు ఇస్తున్నాయని, ఇక ప్రజా స్వామ్యానికి రక్షణ ఎక్కడ ఉంటుందన్నారు. ప్రజలు విశ్వసించే వ్యవస్థ సరైన మార్గంలో వెళ్లడం అవసరం అన్నారు. 

ప్రజా స్వామ్య పరిరక్షణకు న్యాయవ్యవస్థను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ మీడి యా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల వ్యవ స్థ భ్రష్టు బట్టిపోయిందని ఆరోపించారు. 78 ఏళ్ల తరువాత కూడా దేశంలో అసమా నతలు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ నిత్య చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నీలం సంపత్ రచించిన ఈ పుస్తకం సమాజాన్ని విశ్లేషిస్తుందన్నారు. 

ఈ పుస్తకావిష్కరణ సభకు రచయిత డా.ప్రవీణ్ రెడ్డి అధ్యక్షత వహించగా చీఫ్ సెక్రటరీ ఓఎస్డీ కె.విద్యాసాగర్ రావు, ఏఐఎఫ్‌ఆర్ యూసీటీవో ఫైనాన్స్ సెక్రటరీ ఆర్విణి రాజేంద్రబాబు, మాజీ జాతీయ కార్యదర్శి ఎ.పుల్ల య్య, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్టు ఏ.వీ.వీ.ప్రసాద్, కృష్ణమూర్తి, పుస్తక రచయిత డా.నీలం సంపత్ తదితరులు పాల్గొన్నారు.