30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

నకిలీ నెంబర్ ప్లేట్ వినియోగం చట్టరీత్యా నేరం

01-06-2026 02:46 AM

జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్

బంజారాహిల్స్, మే 31 (విజయక్రాంతి): వాహనాలపై నకిలీ నెంబర్ ప్లేట్ వినియోగించడం చట్టరీత్యా నేరమని జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ స్పష్టం చేశారు.అటువంటి చర్యకు పాల్పడిన ఓ వ్యక్తిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు.అందుకు సంబంధించిన వివరాలను జాయింట్ కమిషనర్ వెల్లడించారు. నగరంలోని జిర్రా ప్రాంతానికి చెందిన సయ్యద్ ఒమర్ అహ్మద్ (24) తన ద్విచక్ర వాహనం అసలు నెంబరు TS12EP8323 ను కాస్తా TS12EB8323గా మార్చాడు.

తద్వారా ట్రాఫిక్ పోలీసులను మోసం చేసి చలానాల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.అయితే అసలు వాహనం నెంబరు యజమాని షేక్ అన్వర్ మన్సూరికి చలానాలు జారీ అవుతూ వచ్చాయి.బాధితుడి నుంచి ఫిర్యాదు అందడంతో దీని టప్పాచబుత్రా పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.నకిలీ నెంబర్ ప్లేట్ వినియోగించడం అనేది బీఎన్‌ఎస్,మోటార్ వాహనాల చట్టం ప్రకారం తీవ్రమైన,శిక్షార్హమైన నేరమని జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లను గుర్తించడానికి మరియు వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధునాతన సీసీటీవీ సర్వైలెన్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తోంద ని పేర్కొన్నారు.వాహనాల రిజిస్ట్రేషన్ నంబ ర్ ప్లేట్ల దుర్వినియోగానికి సంబంధించి పౌ రులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా తక్షణమే అధికారులకు నివేదించాలని కోరారు.

బాధితులు https://echallan.tspolice. gov.in వెబ్‌సైట్ ద్వారా గానీ, echallan helpdesk.hyd@gmail.com ఈమెయి ల్ ఐడి ద్వారా గానీ,లేదా ఇ-చలాన్ ట్రాఫిక్ వాట్సాప్ మొబైల్ నంబర్ 8712661690 ద్వారా ఫిర్యాదులు సమర్పించవచ్చని సూచించారు.