11-02-2026 03:16:09 AM
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా గాజు లరామారంలోని మెట్ ఖా నిగూడ, జీడిమెట్ల ఆదర్శ నగర్ లో మంగళవారం ఒక్కసారిగా భూమి కంపిం చింది. ఉదయం 10:17 గంటలకు మూడు సెకన్లపాటు భూమి అదరడంతో స్థానికులు భయభ్రాంతు లకు గురయ్యి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇది భూకంప మా లేక భారీ నిర్మాణాల కోసం వాడే ఇతర పేలుడు పదార్థాల నుంచి వచ్చిన శబ్దమా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే ఇదే విషయంపై ప్రగతి నగర్‌లోని సు నామీ హెచ్చరికల కేంద్రం ప్రతినిధులను వివరణ కోరగా రిక్టర్ స్కేల్‌పై ఎలాంటి భూకంప సూచి కలు నమోదు కాలేదని తెలిపారు. భారీ నిర్మాణాల కోసం ఎవరైనా బ్లాస్టింగ్ చేస్తే భూమి కంపించి ఉం టుందని అనుమానం వ్యక్తం చేశారు.