ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత
17-04-2026 09:23 PM
కోదాడ,(విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోల్ తండ గ్రామానికి చెందిన డాక్టర్ బి సుజాతను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. శుక్రవారం డాక్టర్ బి సుజాత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, బట్టు విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు. ఎల్ హెచ్ పీ ఎస్ జాతీయ నాయకుడు కోట్యా నాయక్ తో పాటు పలువురు గిరిజన నాయకులు సుజాతకు అభినందనలు తెలిపారు.






