11 April, 2026 | 1:57 AM

మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు

11-04-2026 12:00 AM
  1. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలి
  2. ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ సికిందర్
  3. మూడో రోజుకు చేరిన విద్యుత్ కార్మికుల సమ్మె 

మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ఏళ్ల తరబడి ప్రాణాలకు తెగించి వెట్టి చాకిరీ చేస్తున్నా తమ పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, మా సమస్యల పరిష్కారం కోసం చర్చలకు వెంటనే పిలవాలని,తమ న్యాయమైన కోరికలు నెరవేరేంతవరకు సమ్మె కొనసాగి స్తామని విద్యుత్ కార్మిక సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ సికిందర్ అన్నారు.

ఉద్యోగ భద్రత, వేతన పెంపు, విద్యుత్ సంస్థల్లో ఒకే సర్వీస్ రూల్ అమలు చేయాలంటూ ఆర్టిజన్, అన్ మ్యాన్, స్పాట్ బిల్లర్స్, పీస్ రేట్ విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది.జెన్‌కో, ట్రాన్స్‌కో ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న వందలాది మంది కార్మికులు మండుటెండలో  తమ నిరసనను కొనసాగించారు. జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్, విద్యుత్ ఉత్ప త్తి కేంద్రాల వద్ద విద్యుత్ కార్మికులు తమ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సికిందర్ మాట్లాడుతూ న్యాయ మైన సమస్యల పరిష్కారం కోసం అనేక పర్యాయాలు ప్రభుత్వాల, యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగామన్నారు. మాకు ఇచ్చిన హామీలు చేయాలని, తక్షణమే చర్చలకు పిలిచి కార్మికుల సమస్య పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు.

విద్యార్హతల ఆధారంగా ఉద్యోగులు కన్వర్షన్ చేయాలని,ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, టీజీ ఎన్పీడీసీఎల్ , టీజీ ఎస్పీడీసీఎల్‌లలో అన్ మ్యాన్డ్ వర్కర్లకు ఆర్టిజన్లగా విలీనం చేయాలన్నారు. విద్యుత్ సంస్థలు 2016 కంటే ముందు ఉన్న అర్హతను బట్టి పనిచేస్తు ఇప్పటికీ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్‌గా గుర్తించాల ని, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీసీ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం చెల్లించాలన్నారు.

2026 పీఆ ర్సీ వేతన సవరణ అమలు చేయాలని, డిమాండ్లను ష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్ర మంలో వివిధ యూనియన్ నాయకులు పాషా, బోజాలు, సైదులు, రవికుమార్, శ్రీనివాస్, శ్రీనివాస్, దయాకర్, సలీమ్, వెంకటస్వామి, జిల్లా కన్వీనర్ సతీష్, డివిజన్ చైర్మన్ మధు, కన్వీనర్ శ్రీను, కో చైర్మన్ నాగరాజు, కో కన్వీనర్ రమేష్, సునీల్, ఉపేందర్, హరిప్రసాద్, క్రాంతి, చెం దు, సంపత్, ఖాజాబీ, రాజు, ఆర్టిజన్స్, అన్మాన్డ్ కార్మికులు పాల్గొన్నారు.